స్కూళ్లు, అంగన్వాడీల్లో పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ వాయిస్, శాయంపేట : ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత కాల పరిమితిలోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె శాయంపేట మండలం మైలారం గ్రామంలో పర్యటించి, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. వారితో ఆంగ్ల పద్యాలను చదివించి వారి అభ్యాస స్థాయిని స్వయంగా అంచనా వేశారు....