హనుమకొండలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు…
ఆకట్టుకున్న ఒగ్గు డోలు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వరంగల్ వాయిస్, హనుమకొండ : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ .సుందర్ రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ముందుగా రామ్ నగర్ నుంచి అంబేద్కర్ సెంటర్, అశోక సెంటర్, బస్టాండ్ మీదుగా కాళోజి కళాక్షేత్రం వరకు శ్రీకృష్ణుడి రథయాత్ర నిర్వహించారు.భారీ రధయాత్రను తిలకించేందుకు భక్తులు...