సర్ విచారణ ప్రక్రియపై ఆర్డీవో తనిఖీ

వరంగల్ వాయిస్,దామెర: దామెర రెవెన్యూ గ్రామంలో కొనసాగుతున్న సర్ విచారణ ప్రక్రియను పరకాల ఆర్డీవో డీఎస్ వెంకన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, విచారణ ప్రక్రియ కొనసాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో డీఎస్ వెంకన్న మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి అందుతున్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అభ్యంతరాలను పెండింగ్‌లో ఉంచవద్దని, నిర్ణీత సమయంలో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈకార్యక్రమంలో తహసీల్దార్...