ప్రొఫెసర్స్ కాలనీలో వైభవంగా గణేష్ ఉత్సవ వేడుకలు
అలరించిన చిన్నారుల కూచిపూడి నాట్య ప్రదర్శన వరంగల్ వాయిస్, హసన్ పర్తి: హనుమకొండ ప్రొఫెసర్స్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, సాంస్కృతిక వైభవంతో ఘనంగా ముగిశాయి. నిమజ్జనం మరియు వీడ్కోలు కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు కాలనీవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్నారులు సమర్పించిన భరతనాట్య ప్రదర్శన ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం నాలుగు సంవత్సరాల వయస్సు నుంచే నాట్య శిక్షణ పొందుతున్న పది మంది చిన్నారులు లయ, తాళం, అభినయంతో చేసిన సమిష్టి భరతనాట్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను...