WarangalVoice
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 10:15 am Digital Edition : Ravi Goli

  • ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేయాలని కలెక్టర్‌కుఎస్టీ రిజర్వేషన్ రద్దు చేయాలని కలెక్టర్ వినతి

వరంగల్ వాయిస్, దామెర: మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఎస్టీ వర్గానికి చెందిన ప్రజలు లేకపోయినా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడంపై గ్రామ సర్పంచ్ నవీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రిజర్వేషన్‌ను రద్దు చేసి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోస్టును భర్తీ చేయాలని కోరారు.

ఈ మేరకు సర్పంచ్ నవీన్ వార్డు సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామ జనాభాలో ఎస్టీ వర్గానికి చెందిన వారు లేనందున అంగన్వాడీ పోస్టుకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం వల్ల స్థానికంగా అర్హులైన అభ్యర్థులకు అవకాశం లేకుండా పోతుందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

పోస్టుకు కేటాయించిన రిజర్వేషన్‌ను పునఃపరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నవీన్ కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.