WarangalVoice
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 12:52 pm Digital Edition : Ravi Goli

ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

వరంగల్ వాయిస్, దామెర: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు దామెర మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రకృతితో మమేకమయ్యే గ్రామీణ జీవనానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో గౌరీదేవిని బతుకమ్మగా భావించి మహిళలు ఆరాధిస్తారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతిబింబంగా నిలిచే ఈ పండుగనుఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.పండుగ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి గునుగు, తంగేడు, సీతజడలు, మందారం, తామర తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి జానపద పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.మహిళల ఆటపాటలతో పల్లెలన్నీ పూలవనాలను తలపించాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెబుతూ ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమయ్యాయి.