4వ బెటాలియన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వరంగల్ వాయిస్, మామునూర్ : 4వ బెటాలియన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 4వ బెటాలియన్ కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి కమాండెంట్ పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవ, సేవ పథకాలను పొందిన సిబ్బందికి అందజేశారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా...