WarangalVoice
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 3:25 pm Digital Edition : Ravi Goli

70వ ఎస్ జీఎఫ్ లో ‘మణి మార్షల్ ఆర్ట్స్’ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన దేవరాజు కార్తిక, కార్తీక్ పార్శి

విద్యార్థులకు అభినందిచిన అకాడమీ కోచ్ మణికంఠ గడదాసు

వరంగల్ వాయిస్, కాజీపేట : 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాజీపేటలో నిర్వహించిన అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కరాటే ఎంపిక పోటీల్లో ‘మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ’ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ ఎంపికల్లో అకాడమీకి చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటారు. బాలికల విభాగంలో: +66 కేజీల కేటగిరీలో దేవరాజు కార్తిక, బాలుర విభాగంలో: -66 కేజీల కేటగిరీలో కార్తీక్ పార్శి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అకాడమీ మార్షల్ ఆర్ట్స్ ప్రధాన కోచ్ మణికంఠ గడదాసు మాట్లాడుతూ.. తమ అకాడమీ విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, కఠిన సాధన, నిరంతర శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ వీరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాలతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను వారి తల్లిదండ్రులు, అకాడమీ సభ్యులు, తోటి క్రీడాకారులు, పలువురు ప్రముఖులు అభినందించారు.