80 మీటర్ల జాతీయ జెండాతో ఘనంగా తిరంగా ర్యాలీ….
వరంగల్ వాయిస్, హనుమకొండ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ ఐక్యత, త్రివర్ణ పతాకంపై గౌరవాన్ని ప్రజల్లో మరింత పెంపొందించాలనే సంకల్పంతో గ్రేటర్ వరంగల్ 60వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో 80 మీటర్ల భారీ జాతీయ జెండాతో యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో...