Saturday, April 11, 2026
HomeHanamkondaవరంగల్‌లో డబ్యూడీటీఏ–2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం

వరంగల్‌లో డబ్యూడీటీఏ–2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

 

హనుమకొండ (వరంగల్ వాయిస్): క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, అవి యువతను క్రమశిక్షణతో కూడిన సన్మార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆఫీసర్స్ క్లబ్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డబ్యూడీటీఏ–2026 అంతర్ జిల్లా టెన్నిస్ టోర్నమెంట్‌ను శనివారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డబ్యూడీటీఏ అధ్యక్షులు గండ్ర సత్యనారాయణ రెడ్డితో పాటు రవీందర్ రెడ్డి, మురుగన్, కన్నా రెడ్డి, టీ.బాబు రెడ్డి, కమల్, డాక్టర్ జయసింహ రెడ్డి, రవీంద్రనాథ్, ప్రభాకర్ రావు, వి.ఎస్.రెడ్డి, జి.రవీందర్, దుర్గా ప్రసాద్, శరత్, డాక్టర్ ప్రవీణ్ (డెంటల్), తెలుగు రామకృష్ణ తదితర క్రీడాభిమానులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular