Sunday, April 26, 2026
HomeHanamkondaఊరుగొండలో బాలిక అదృశ్యం

ఊరుగొండలో బాలిక అదృశ్యం

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండల పరిధిలోని ఊరుగొండ గ్రామానికి చెందిన చాపర్తి సాత్విక (13) అనే బాలిక శనివారం మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయింది. బాలిక తండ్రి సతీష్ కాగా, ఇంటి వద్ద ఉన్న బాలిక మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక తల్లి చాపర్తి కోమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై కొంక అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఎత్తు 4 అడుగుల 2 అంగుళాలు, రూపం చామన చాయ రంగు, గుండ్రటి ముఖం కలిగి ఉంటుంది. కనిపించకుండా పోయిన సమయంలో ఆరెంజ్ కలర్ పంజాబీ డ్రెస్ మరియు వైట్ కలర్ స్కార్ఫ్ ధరించి ఉంది. ఈ బాలిక ఆచూకీ ఎవరికైనా తెలిసినా లేదా కనిపిస్తే వెంటనే 8712685228 (ఎస్సై, దామెర), 8712685020 (పోలీస్ స్టేషన్, దామెర) ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ప్రజలు సహకరించాలని ఎస్సై అశోక్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular