Wednesday, April 29, 2026
HomeHanamkondaరాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా సుధాకర్

రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా సుధాకర్

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శనిగరం సుధాకర్ ను నియమిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాం రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తనకు సహకరించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలకు శనిగరం సుధాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular