Monday, November 2, 2026
HomeHanamkondaగ్రాడ్యుయేట్ ఓటును ఆన్లైన్ లో నమోదు చేసుకున్న గడ్డం కేశవమూర్తి

గ్రాడ్యుయేట్ ఓటును ఆన్లైన్ లో నమోదు చేసుకున్న గడ్డం కేశవమూర్తి

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్,హనుమకొండ : వరంగల్- ఖమ్మం -నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఓటరు జాబితా నమోదులో భాగంగా ఆదివారం గ్రేటర్ వరంగల్ 8వ డివిజన్ 4-7 బ్లాకులో బి ఆర్ ఎస్ నాయకులు పానుగంటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా వరంగల్ వాయిస్ పత్రిక ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవ మూర్తి కి గ్రాడ్యుయేట్ ఓటును ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో బ్లాక్ ఇంచార్జీలు గోస్కుల అశోక్, ఏర్రోజు భాస్కర్,పొన్నాల రాము,రుద్రోజు సంపత్,తాళ్ళ దయానంద్,వైనాల మహేందర్,చాగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular