Wednesday, August 19, 2026
HomeHanamkondaఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, బాలసముద్రం : బహుజన యోధుడు, చారిత్రక పురుషుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్క్ ప్రాంగణంలో శ్రీ కౌండిన్య గౌడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కౌండిన్య గౌడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేశిని సిద్ధార్థ్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి లేదా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన దేశిని సిద్ధార్థ గౌడ్ మరియు మోడెం ఉమేష్ గౌడ్ మాట్లాడుతూ… బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన ధైర్యసాహసాలు, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమాజంలో బహుజనుల ఐక్యతకు పాపన్న చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ కౌండిన్య గౌడ్స్ అసోసియేషన్ కార్యదర్శి బయ్యగాని కుమారస్వామి గౌడ్, నాయకులు మోడెం ఉమేష్ గౌడ్, విజయ్ గౌడ్, మూల ప్రసాద్ గౌడ్, సతీష్ గౌడ్, కొండం సత్యనారాయణ గౌడ్, పొగాకుల నగేష్ గౌడ్, బండి మల్లేశం గౌడ్, బండి ఐలయ్య గౌడ్, పలువురు వాకర్స్ మిత్రులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular