Wednesday, April 15, 2026
HomeHanamkondaబాధితుడికి ఇనగాల పరామర్శ

బాధితుడికి ఇనగాల పరామర్శ

📰 Generate e-Paper Clip

(వరంగల్ వాయిస్, దామెర) : మండలంలోని వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోల్కొండ రాజయ్యను హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సోమవారం పరామర్శించారు. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజయ్య ప్రస్తుతం హనుమకొండలోని రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా రాజయ్య ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న ఇనగాల, బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రాజయ్య త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular