ముఖ్య అతిథిగా హాజరైన మార్త రమేష్
(గీసుగొండ – వరంగల్ వాయిస్): గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో మంగళవారం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు చిరస్మరణీయంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ విగ్రహాన్ని నిమ్స్ అనుసంధాన అధికారి డాక్టర్ మార్త రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ.. భారతదేశ భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అందరికీ సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని అందించిన ఏకైక మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన గౌరవమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విగ్రహ నిర్మాణ దాతలు, సామాజికవేత్త మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అల్లం స్వప్న-బాల కిషోర్ రెడ్డి, అల్లం మర్రి రెడ్డిల చొరవను గ్రామస్తులు అభినందించారు. గ్రామంలో ఇలాంటి మహనీయుల విగ్రహాల ఏర్పాటు సామాజిక చైతన్యానికి ప్రతీక అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వీరగోని రాజకుమార్, రడo భరత్, నాయకులు చిన్నస్వామి, రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన యూత్ అంబేద్కర్ కమిటీ నిర్వాహకులు అనిల్, చంటి, చోటు, పవన్ కళ్యాణ్, సందీప్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బాబాసాహెబ్‌కు ఘన నివాళులర్పించారు.
