Tuesday, May 12, 2026
HomeHanamkondaమహేష్ కుమార్ గౌడ్‌కు ఘన స్వాగతం

మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

ఒగ్లాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల నీరాజనం

వరంగల్ వాయిస్, దామెర : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి దామెర మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఒగ్లాపూర్ గ్రామ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బిల్లా రమణారెడ్డి, ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఘన నీరాజనం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి మహేష్ కుమార్ గౌడ్ అందిస్తున్న నాయకత్వం, చేస్తున్న కృషిని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. టీపీసీసీ అధ్యక్షుడి రాకతో ఒగ్లాపూర్ చౌరస్తా వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుబాసి రాజేందర్, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, నాయకులు సుధాకర్, కోటి, శంకర్, వేణు, విజేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular