Tuesday, November 3, 2026
HomeParakalaమద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత అధికారులదే…

మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత అధికారులదే…

📰 Generate e-Paper Clip

పత్తి ధరలు తగ్గడంపై విచారణ జరిపించాలి
– రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు

వరంగల్ వాయిస్, పరకాల : రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ అధికారులపై ఉందని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి పత్తి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు మాట్లాడుతూ పత్తి ధరల విషయంలో ఇతర వ్యవసాయ మార్కెట్ లతో పోలిస్తే ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో తక్కువ ధరలు లభించడంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఇక్కడ తక్కువ ధరలు లభించడానికి గల కారణాలపై విచారణ జరిపించాలన్నారు. మార్కెట్లో పారదర్శకమైన బహిరంగ వేలం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. పత్తి కొనుగోళ్లలో వ్యాపారుల మధ్య కుమ్మక్కు లేదా ధరల నియంత్రణ జరుగుతుందా అని అంశాన్ని పరిశీలించాలన్నారు. రైతుల పత్తికి సరైన ధర నిర్ణయించేలా వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. పత్తి నాణ్యత, తేమశాతం పేరుతో రైతులకు అన్యాయం జరగకుండా నిబంధన ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురువక పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గాయన్నారు. ఎకరాకు రావలసిన దిగుబడిలో భారీగా కోత పడటంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి సమయంలో పత్తికి సరైన ధర రాకపోవడం రైతులను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద రెండవ మార్కెట్ అయిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రైతుల చెమటకు తగిన ప్రతిఫలం అందించే కేంద్రంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ జిల్లా ఉపాధ్యక్షుడు చౌళ్ల రామారావు జిల్లా కార్యదర్శి సురాబు బాబురావు నాయకులు నాగుర్ల రాజీరు, భాషబోయిన కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular