Saturday, August 15, 2026
HomeHanamkondaగాంధీనగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...

గాంధీనగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్,హనుమకొండ : నగరంలోని 57వ డివిజన్ గాంధీనగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెరుకు వెంకట రాజిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.దేశభక్తి నినాదాలతో గాంధీనగర్ వీధులు మార్మోగాయి. ర్యాలీలో స్థానికులు, యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ ఐక్యత,అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్ అభివృద్ధికి కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ర్యాలీ అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి,స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గాంధీనగర్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular