వరంగల్ వాయిస్, మామునూర్ : 4వ బెటాలియన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 4వ బెటాలియన్ కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి కమాండెంట్ పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవ, సేవ పథకాలను పొందిన సిబ్బందికి అందజేశారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్బంగా కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు.దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతదేశం లభించిందని పేర్కొన్నారు.దేశ సమగ్రత, సార్వభౌమత్వం, శాంతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.పోలీస్ సిబ్బంది ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు.యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, దేశ సేవ పట్ల అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా బెటాలియన్ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్ జె.రాజేందర్, ఆర్ఐలు విజయ్,కార్తీక్,రవి,పురుషోత్తం రెడ్డి, సర్వర్,రాజ్ కుమార్, కృష్ణ, రాంచందర్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది, మినిస్ట్రీయల్, యూనిట్ మెడికల్ స్టాఫ్ పాల్గొన్నారు.
