వరంగల్ వాయిస్, హనుమకొండ :నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్లు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో వెంటనే నివసించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు.సోమవారం న్యూ శాయంపేటలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బ్లాక్‌లను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా బ్లాక్‌లను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇప్పటివరకు ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే తమకు కేటాయించిన ఇళ్లలో నివసించాలని కోరారు.ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అందిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇళ్లు మంజూరై, కేటాయింపు పూర్తయిన వారు వెంటనే తమ ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.మొత్తం 19 బ్లాక్‌లకు గాను ప్రస్తుతం 6 బ్లాక్‌లకు విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. మిగతా బ్లాక్‌లకు కూడా వారం రోజుల్లోగా విద్యుత్ సౌకర్యం కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో హౌసింగ్ పీడీ సిద్దార్థ్ నాయక్, ఆర్‌అండ్‌బీ ఈఈ, హౌసింగ్ ఏఈ, డీఈలు, తదితరులు పాల్గొన్నారు.
కేటాయించిన ఇళ్లలో వెంటనే నివసించాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
RELATED ARTICLES
