Tuesday, August 18, 2026
HomeHanamkondaమల్లికాంబ మనోవికాస కేంద్రానికి ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం లక్ష రూపాయల సామగ్రి విరాళం

మల్లికాంబ మనోవికాస కేంద్రానికి ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం లక్ష రూపాయల సామగ్రి విరాళం

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్,హనుమకొండ:మల్లికాంబ మనోవికాస కేంద్రానికి నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ (NAPA) ఆధ్వర్యంలో రూ.1 లక్ష విలువైన కిచెన్ ఎక్విప్‌మెంట్స్, బెడ్స్, స్టీల్ బల్లలు, డైనింగ్ టేబుల్స్‌తో పాటు పలు అవసరమైన సామగ్రిని విరాళంగా అందజేశారు. దివ్యాంగుల సౌకర్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి సమన్వయకులు, సభాధ్యక్షులుగా ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత సంవత్సరం కొండా ప్రభాకర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ హోదాలో మల్లికాంబ మనోవికాస కేంద్రంలో రాఖీ పండుగను దివ్యాంగుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆ సందర్భంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక నిర్దిష్ట సహాయ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించినట్లు తెలిపారు.గత 13 సంవత్సరాలుగా నార్త్ అమెరికా పద్మశాలి సంఘం పద్మశాలి కులబాంధవుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న పురోగతిపై అవగాహన కల్పించడం, విద్యా ఉపకార వేతనాలు అందించడం, ఉపాధి అవకాశాలపై మార్గదర్శనం చేయడం, వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారని వివరించారు.
అలాగే మహిళల ఆర్థిక సాధికారత కోసం కుట్టు మిషన్ల పంపిణీ, మెగా ఉచిత ఆరోగ్య శిబిరాలు, బలమైన కమ్యూనిటీ బంధాల నిర్మాణం, వ్యక్తుల సాధికారత, సమాజ సంక్షేమం, దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే కార్యక్రమాల్లో సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడం, చేనేత కార్మికుల సంక్షేమం, “సేవ్ ది రివర్స్” వంటి పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నార్త్ అమెరికా పద్మశాలి సంఘం సూచన మేరకు రూ.1 లక్ష విలువైన కిచెన్ ఐటమ్స్, బెడ్స్, స్టీల్ బల్లలు, డైనింగ్ టేబుల్స్ తదితర వస్తువులను దివ్యాంగుల సౌకర్యం కోసం మల్లికాంబ మనోవికాస కేంద్రానికి బహుకరించడం సంతోషంగా ఉందని ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని తన ద్వారా నిర్వహించే అవకాశం కల్పించినందుకు NAPAకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం మల్లికాంబ మనోవికాస కేంద్రం స్థాపకులు బండా రామలీల మాట్లాడుతూ.. కేంద్రానికి అవసరమైన సుమారు రూ.1 లక్ష విలువైన సామగ్రిని విరాళంగా అందించిన నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ (NAPA) కు కృతజ్ఞతలు తెలిపారు. దాతలు, సేవా సంస్థలు అందిస్తున్న సహకారం కేంద్రంలోని సేవలను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ వి. శ్రీకుమార్, సూపరింటెండెంట్, రీజనల్ ఐ హాస్పిటల్, వరంగల్, కొండా కృపాకర్ , ఎంపీడీవో, సూర్యనారాయణ గారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, కుసుమ అశోక్ , మెరుగు సత్తయ్య , చిలివేరు శంకర్ , గాజుల సంపత్ తదితరులు హాజరయ్యారు.అలాగే సామల దయాకర్ , రిటైర్డ్ ప్రిన్సిపాల్, అనగంటి శ్రీకాంత్ , అధ్యక్షులు, ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ, కట్టా అఖిల్ , చార్టర్డ్ అకౌంటెంట్, బండా సదానందం రావు , ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular