వరంగల్ వాయిస్, హసన్పర్తి : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ విశేష సేవలందిస్తున్న కనుకుంట్ల నాగేశ్వరరావును అఖిల భారత పద్మశాలి సంఘం వైద్య ఆరోగ్య విభాగం ఘనంగా సత్కరించింది. హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఆయన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగేశ్వరరావు వైద్య రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించి ‘పద్మ వైద్యశ్రీ’ విశిష్ట జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నాగేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వలస శ్రీనివాస్, కోడెం నాగేశ్వరరావు, సాంబారి రేవంత్ కుమార్, చిట్యాల చంద్రశేఖర్, కస్తూరి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
.
