గంట రవికుమార్
వరంగల్, (వరంగల్ వాయిస్): సమాజంలో అసమానతలు లేని సమానత్వాన్ని కాంక్షించి, తన జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కొనియాడారు. శనివారం ఫూలే జయంతిని పురస్కరించుకుని, జిల్లా నాయకులు కూచన క్రాంతి కుమార్, మండల అధ్యక్షులు ఇప్ప సుధాకర్ ఆధ్వర్యంలో వరంగల్ దేశాయిపేటలో ఉన్న ఫూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ.. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి, సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం భావి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. వెనుకబడిన మరియు దళిత వర్గాల అభ్యున్నతికి ఫూలే వేసిన బాట, సమాజ శ్రేయస్సును కాంక్షించే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తాబేటి వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బైరి మురళీకృష్ణ, గోగికర్ అనిల్ తో పాటు జిల్లా నాయకులు గోకే వెంకటేష్, అంకాల జనార్ధన్, బైరి శ్యాం సుందర్, ముండ్రాతి వెంకటేశ్వర్లు, అల్లి అజయ్, మాదాసు రాజు, కోమాకుల నాగరాజు పాల్గొన్నారు. అలాగే మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, బోరిగం నాగరాజు, నాయకులు జన్ను సుబ్రహ్మణ్యం, తోట సురేష్, కొంతం సంగీత్, మల్లికార్జున్, ప్రభాకర్ గుప్త, హనుమంతు, శ్రీధర్, జన్ను నాగరాజు తదితరులు పాల్గొని ఫూలే సేవలను స్మరించుకున్నారు.
