Saturday, April 11, 2026
HomeBhupalapallyవిద్యుత్ కార్మికుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు

విద్యుత్ కార్మికుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు

📰 Generate e-Paper Clip

చందుపట్ల కీర్తి రెడ్డి

కేటీపీపీ సమ్మె శిబిరంలో బీజేపీ నేతల ధర్నా

టెంట్ వేయనివ్వకపోవడంపై ఆగ్రహం

గణపురం (వరంగల్ వాయిస్): తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై చెల్పూర్ కేటీపీపీ వద్ద సమ్మె నిర్వహిస్తున్న విద్యుత్ ఆర్టిసన్, అన్-మ్యాన్డ్ పీస్ రేట్ కార్మికులకు బీజేపీ అండగా నిలిచింది. శనివారం నిర్వహించిన సమ్మెలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని, కార్మికులతో కలిసి కూర్చొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. సమాజానికి వెలుగులు పంచే విద్యుత్ కార్మికుల జీవితాల్లో ప్రభుత్వం చీకట్లు నింపడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మికులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కనీసం టెంట్ వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. వెంటనే ఎస్ఓతో మాట్లాడిన ఆమె, కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. రేపటి వరకు టెంట్ ఏర్పాటు చేయకుంటే తామే దగ్గరుండి వేయిస్తామని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి ఆర్టిసన్ ఉద్యోగిని తక్షణమే కన్వర్షన్ చేయాలి. ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. అన్-మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిసన్లుగా విలీనం చేయాలి. 2016 కంటే ముందు నుండి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను గుర్తించి భరోసా కల్పించాలి. జీవో నెం.11 ప్రకారం కనీస వేతనాలు మరియు 2026 పీఆర్‌సీ అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు, ప్రధాన కార్యదర్శి బనగాని రాజశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ సాయి పటేల్, బూత్ అధ్యక్షులు జెడ్సన్, కంకణాల వంశీ, మొగిలి, మనోహర్, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular