Tuesday, May 12, 2026
HomeBhupalapallyఘోర రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సమీపంలోని నాగులమ్మ క్రాస్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు భారీ లారీలు బలంగా ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మంథని వైపు నుంచి ఇసుక లోడ్‌తో కాటారం వెళ్తున్న లారీ, అలాగే కాటారం నుంచి తాడిచెర్ల బొగ్గు గని వైపు వెళ్తున్న బొగ్గు లారీ నాగులమ్మ క్రాస్ వద్దకు రాగానే అతివేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి.

RELATED ARTICLES

Most Popular