Tuesday, April 14, 2026
HomeHanamkondaప్రాణాలకు శ్రీరామరక్ష.. రహదారి భద్రత

ప్రాణాలకు శ్రీరామరక్ష.. రహదారి భద్రత

📰 Generate e-Paper Clip

ఆత్మకూరు సీఐ సంతోష్

వరంగల్ వాయిస్, ఆత్మకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రహదారి భద్రత అవగాహన కార్యక్రమం రెండో రోజు ఆత్మకూరు మండలంలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పెదాపూర్ గ్రామంలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహాల వద్ద సీఐ సంతోష్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, యువత కలిసి రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ప్రజల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట “హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదు” అనే హెచ్చరిక ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకుండా పోలీస్ స్టేషన్‌లోకి వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని సీఐ సంతోష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వత గిరి మహేశ్వరి రాజు, పరకాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్, రేవూరి జయపాల్ రెడ్డి, వడ్డేపల్లి ప్రసాద్, తనుగుల సందీప్, భయ్యా కుమారస్వామి, చిమ్మని దేవరాజ్, బరుపట్ల కిరీటి, కాడబోయే రమేష్, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, యువకులు హాజరై రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తామని ప్రమాణం చేశారు.

RELATED ARTICLES

Most Popular