Wednesday, April 22, 2026
HomeWarangalవిద్యార్థులకు ‘ప్రగతి పత్రాల’ పంపిణీ

విద్యార్థులకు ‘ప్రగతి పత్రాల’ పంపిణీ

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామ పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఫలితాల ప్రగతి పత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయులు కునమల్ల రాజన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాగరాజుపల్లి గ్రామ సర్పంచ్ ఎరుకల లలిత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఫలితాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎరుకల లలిత మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణను అలవర్చుకోవాలని, శ్రద్ధాసక్తులతో చదువుకోవాలని పిలుపునిచ్చారు. జీవితంలో గొప్ప స్థానాలకు చేరుకోవాలంటే విద్య ఒక్కటే మార్గమని ఆమె స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలు కాకూడదని, ఆ టలు, పాటలు మరియు చిత్రలేఖనం వంటి సృజనాత్మక అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ వేడుకలో పాఠశాల ఏఏపీసీ చైర్మన్ ఎరుకల వెంకటలక్ష్మి, ఎంవీ పల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌలి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తమ పిల్లల ప్రగతిని చూసి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular