వరంగల్ వాయిస్, దామెర : ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం దామెర పోలీసుల ఆధ్వర్యంలో ఊరుగొండ గ్రామంలో డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో 200 మంది యువకులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. దామెర ఎస్సై కొంక అశోక్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్, గుట్కా మత్తు పదార్థాల బారిన పడవద్దని, గంజాయి అమ్మినా, సేవించిన 8712685020 మొబైల్ నెంబరుకు గానీ, డయల్ 100కు సమాచారమందించాలని కోరారు. స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు
