Monday, November 2, 2026
HomeWarangalపేకాట రాయుళ్ల పై పోలీసులు మెరుపు దాడి

పేకాట రాయుళ్ల పై పోలీసులు మెరుపు దాడి

📰 Generate e-Paper Clip

నగదు రూ.55,280/-, ప్లేయింగ్ కార్డ్‌లు, 08 మొబైల్స్ , 05 వాహనాలు స్వాధీనం…
వరంగల్ వాయిస్, వరంగల్ : మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం ఆదివారం వరంగల్‌లోని ఎస్ విపి రోడ్‌లోని భిల్వా ఐ ఎన్ ఎన్ హోటల్స్‌లో ప్లే కార్డులు ఆడుతుండగా పోలీసులు మెరుపు దాడి చేసి 08 మందిని పట్టుకున్నారు.వారిని నుండి నగదు రూ.55,280, ప్లేయింగ్ కార్డ్‌లు,08 మొబైల్స్,05 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దాడి పూర్తయిన తర్వాత, పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల కోసం మట్టెవాడ పోలీసులకు అప్పగించారు.పట్టుబడిన వారిలో 1. గాదె రాజేందర్,2. దుబాసి అనిల్,3. బిల్లా శివ కుమార్,4. బల్లి శేఖర్,5. కోకొండ వేణు, 6. పింగ్లికర్ మహేష్,7. గడ్డం రాజు, 8. నర్శెట్టి చిరంజీవి లు ఉన్నారు. ఈ దాడి లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి. క్రాంతి కుమార్,సబ్ ఇన్‌స్పెక్టర్ కె. సుధాకర్, బి. ఉప్పలయ్య, ఎస్‌ఐ ఆఫ్ పోలీస్, టాస్క్ ఫోర్స్ బృందం ను టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూధన్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular