Tuesday, April 21, 2026
HomeHanamkondaప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలి

ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకోవాలి

📰 Generate e-Paper Clip

ఒగ్లాపూర్ తెలంగాణ ఉద్యమకారుల గ్రామ కమిటీ ఎన్నిక

వరంగల్ వాయిస్, దామెర: తెలంగాణ ఉద్యమకారులను ప్రజా ప్రభుత్వం గుర్తించి, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు పోలేపాక ఆరోగ్యం, ప్రధాన కార్యదర్శి గడ్డం సదానందం కోరారు. మంగళవారం దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు.
ఎంపికైన ఒగ్లాపూర్ గ్రామ కమిటీ లో అధ్యక్షుడిగా నల్ల దయాకర్, ఉపాధ్యక్షుడు: కిన్నెర రామస్వామి, ప్రధాన కార్యదర్శి: దురిశెట్టి రమేష్, కోశాధికారి: కీసర రమేష్, కమిటీ సభ్యులు పలకల విజయేందర్ రెడ్డి, ఏదుళ్ళ విజయేందర్ రెడ్డి, దుబాసి రమేష్, నూనె కిషన్, కిన్నెర నరసింహస్వామి, నూనె రాజయ్య, నల్ల చేరాలు, పలకల శ్రీనివాసరెడ్డి లు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల త్యాగాలు వెలకట్టలేనివని, గ్రామస్తుల సహకారంతో ఉద్యమ కాలంలో వీరంతా చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఎన్రెడ్డి నరసింహారెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించగా, విషయం తెలుసుకున్న మండల సంఘం నాయకులు పోలేపాక ఆరోగ్యం, సదానందం, గ్రామ కమిటీ సభ్యులు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular