Wednesday, April 15, 2026
HomeHanamkondaరేపు “వాక్ ఫర్ ఈక్వాలిటీ - విజ్ఞాన జ్యోతి యాత్ర”

రేపు “వాక్ ఫర్ ఈక్వాలిటీ – విజ్ఞాన జ్యోతి యాత్ర”

📰 Generate e-Paper Clip

అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్ వాయిస్, హనమకొండ : భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని హనుమకొండలో “వాక్ ఫర్ ఈక్వాలిటీ – విజ్ఞాన జ్యోతి యాత్ర”ను రేపు ఘనంగా నిర్వహించనున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్.నాగరాజు తెలిపారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన యాత్ర వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య పత్రమని కొనియాడారు. సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ విజ్ఞాన యాత్ర హన్మకొండలో వరుసగా నాలుగవ సంవత్సరంలోకి అడుగుపెడుతోందని, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తొలుత హసన్‌పర్తి టౌన్ నుండి జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడుతుంది. అనంతరం కేయూసీ జంక్షన్ నుంచినగరంలోని ప్రధాన మార్గాల గుండా అంబేద్కర్ సెంటర్ వరకు భారీ పాదయాత్ర కొనసాగుతుంది. యువత, విద్యార్థులు, మేధావులు ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ యాత్రలో రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే వెల్లడించారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ మీడియా సమావేశంలో కుడా చైర్మన్, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామి రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular