Tuesday, June 23, 2026
HomeCrime_newsల్యాదల్ల రాజు హత్య కేసులో న్యాయం కోరుతూ కుమార్తె ధర్నా

ల్యాదల్ల రాజు హత్య కేసులో న్యాయం కోరుతూ కుమార్తె ధర్నా

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, వరంగల్ :  గొర్రెకుంట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ల్యాదల్ల రాజు హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన కుమార్తె మరియు కుటుంబ సభ్యులు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, రాజు హత్య జరిగి ఎన్నో నెలలు గడిచినా ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా హత్య కేసులో గాయాలను సరిగ్గా నమోదు చేయకపోవడం, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా వివరాలు బయట పెట్టకపోవడం, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును ఆలస్యం చేయడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం, వంటి అంశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు కుమార్తె , రాజు భార్య ప్రియాంక, భావోద్వేగంతో మాట్లాడుతూ, నా కుమార్తె కి తండ్రి తెచ్చి ఇవండనీ, కుమార్తె నా తండ్రికి న్యాయం కావాలి ఆయన ఆత్మశాంతించాలి… నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలి” అని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను వేడుకున్నారు.

RELATED ARTICLES

Most Popular