- హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
- ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం
- క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ
- స్క్రీనింగ్ పరీక్షల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
వరంగల్ వాయిస్, హనుమకొండ (24 మార్చి 2026): హనుమకొండ జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. హై రిస్క్ ఉన్న గ్రామాలలో స్క్రీనింగ్ పరీక్షల నిర్వహించాలని అన్నారు. వంద శాతం స్క్రీనింగ్ పరీక్షలు జరగాలన్నారు. టీబీ బారిన పడిన వారికి ప్రభుత్వంతో ప్రైవేట్ ఆస్పత్రులు, ఉద్యోగుల నుండి పౌష్టిక ఆహారం కలిగిన న్యూట్రిషన్ కిట్లను అందజేయడం అభినందనీయమన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ కీలకపాత్రను పోషించాలన్నారు. వచ్చే ఏడాది ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నాటికి హనుమకొండ జిల్లాను టీబీ ముక్త్ జిల్లాగా చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని, అందుకు కృషి చేయాలని కోరారు. టిబి వ్యాధి లక్షణాల బారిన పడి నిర్ధారణ అయిన వారు ఆరు నెలలపాటు సరైన మందులు, పౌష్టిక ఆహారం తీసుకున్నట్లయితే వ్యాధి నుంచి కోలుకోవచ్చని అన్నారు. అందరూ ఆలోచించి కలిసి పనిచేస్తే టీబీ నివారించవచ్చునని పేర్కొన్నారు. కొన్ని గ్రామాలలో వంద శాతం స్క్రీనింగ్ చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో టీబీ నియంత్రణకు కృషి చేస్తామని అధికారులు, ప్రజలతో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా 630 మంది టీబీ చికిత్స తీసుకుంటున్న వారికి న్యూట్రిషన్ కిట్స్ అందించిన ఆదిత్య హాస్పిటల్,ఇండియన్ రెడ్ క్రాస్ ,చక్రవర్తి హాస్పిటల్,ప్రతిమ రిలీఫ్ , ప్రశాంతి హాస్పిటల్,శ్రీ చక్ర ఆస్పత్రుల వారికి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించి ఇతరులు వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలన్నారు. టీబీ చాంపియన్ లు, టీబీ నియంత్రణ లో కృషిచేసిన సిబ్బందికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ టీబీ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ల వద్ద పరీక్ష చేయించుకుని నిర్ధారణ అయితే చికిత్స తీసుకోవాలని, చికిత్స కాలంలో మంచి పోషకాహారం తీసుకోవాలని అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ దశ కార్యక్రమంలో 100 రోజుల క్యాంపెయిన్ ను ఈరోజు ప్రారంభించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశములను దృష్టిలో పెట్టుకొని 2,492 గ్రామాలను హైరిస్క్ గ్రామాలుగా గుర్తించగా మన జిల్లాలో 25 గ్రామాలను హై రిస్క్ గ్రామాలుగా గుర్తించడం జరిగినది. ఈ గ్రామాలలో వంద రోజులలో 14 సంవత్సరంలు పైబడిన వారందరినీ పరీక్షించి, ఎక్స్రే మరియు సిబి నాట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో 2025 సంవత్సరంలో 1614 టీవీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించడం జరిగింది.1416 మందికి కిచ పూర్తి కావడం జరిగింది అలాగే 252 మందికి నిక్షయ్ పోషన్ యోజన ద్వారా ప్రతినెల 1000 రూపాయలు చొప్పున ఆరు నెలల కాలం పాటు అందించడం జరిగిందన్నారు. జిల్లా టీవీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు జిల్లాలో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమ వివరాలను , ఇది వ్యాధి లక్షణములను తీసుకోవాల్సిన జాగ్రత్తలను చికిత్స గురించి మాట్లాడడం జరిగింది.
ఈ రోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్పెషలిస్ట్ వైద్యుల శిబిరంలో 6 విభాగముల స్పెషలిస్ట్ డాక్టర్లు వైద్య సేవలు అందించడం జరిగింది అలాగే అవసరమైన వారికి ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి , Dy dmho Dr ప్రదీప్ రెడ్డి,Mpdo శ్రీనివాస్ రెడ్డి,ప్రోగ్రామ్ అధికారులు dr శ్రీనివాస్,Dr రుబీనా,మెడికల్ ఆఫీసర్ dr స్పందన,జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

