ఆకట్టుకున్న అంగన్వాడీ చిన్నారుల దేశభక్తి ప్రదర్శనలు…
వరంగల్ వాయిస్, హాసన్ పర్తి : గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ పరిధిలోని వంగపహాడ్లో గడవంశీయ కులం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల పెద్దమనిషి ముస్కు వీరేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అంగన్వాడీ చిన్నారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ముస్కు రాజమౌళి, ముస్కు వేణు, ముస్కు రాజేంద్రప్రసాద్, కోడెం నరేష్‌బాబు, కాళిదాసు శివ, రాము, వినయ్, గోపు శంకర్, నరసింహ, రంజిత్, రవి, ప్రేమ్, కృష్ణ, శేఖర్, రాజేష్‌తో పాటు చిన్నారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
