Monday, August 17, 2026
HomeWarangalజానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డా.గడ్డం వెంకన్నకు ప్రొఫెసర్ గా పదోన్నతి

జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డా.గడ్డం వెంకన్నకు ప్రొఫెసర్ గా పదోన్నతి

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, వరంగల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న జానపద విజ్ఞాన అధ్యయనంలో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు.
ఈ మేరకు సోమవారం హైదరాబాద్ బాచుపల్లి లోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు ఉత్తర్వులు అందజేసి వెంకన్నను అభినందించారు.​డాక్టర్ గడ్డం వెంకన్న గత 30 ఏళ్లుగా జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇతడికి 30 ఏళ్ల పరిశోధన, 15 ఏళ్ల బోధన అనుభవం ఉంది. ‘పటం కథలు – కథకులు’ అనే అంశంపై పరిశోధన చేసి గ్రంథాన్ని వెలువరించారు. జానపద గిరిజన విజ్ఞాన బహుముఖంశాలపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలలో పర్యటించి 30 కి పైగా పుస్తక రచనలు చేశారు. జాతీయ అంతర్జాతీయ పత్రికలు, జర్నల్స్, పుస్తకాల్లో 70 వరకు వ్యాసాలు ప్రచురించబడ్డాయి. వివిధ జాతీయ స్థాయి సెమినార్లలో పాల్గొని 50 వరకు పత్ర సమర్పణ చేశారు. జానపద గిరిజన విజ్ఞానపీఠంలో డాక్టర్ వెంకన్న పర్యవేక్షణలో ఆరుగురు పిహెచ్ డి, ముగ్గురు ఎంఫిల్ విద్యార్థులు పరిశోధన పూర్తి చేసి డిగ్రీలు పొందారు.జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల్లో భాగంగా వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, విశాఖపట్నం, తూర్పుగోదావరి, చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించి జానపద గిరిజన విజ్ఞాన బహుముఖంశాల సేకరణలో తన వంతు సహాయ సహకారాలు అందించారు. అంతరించిపోతున్న జానపద గిరిజన కళారూపాలు, కళాకారులను గుర్తించి ఆడియో, వీడియో, ఫోటో మాధ్యమాల్లో డాక్యుమెంటేషన్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పలు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి కళోత్సవాల్లో పాల్గొని అవి విజయవంతం కావడానికి కృషి చేశారు.​ఇప్పటివరకు డాక్టర్ గడ్డం వెంకన్న తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ గా, చిత్రవాణి ఇన్చార్జి డైరెక్టర్ గా, డిజైన్ విభాగం శాఖాధిపతిగా , జానపద కళల శాఖాధిపతిగా, వరంగల్ లోని జానపద విజ్ఞాన అధ్యయన శాఖ శాఖాధిపతిగా, పాఠ్య ప్రణాళిక మండలి సభ్యులుగా, రాజమండ్రిలోని సాహిత్య పీఠం పీఠాధిపతిగా, తిరువనంతపురంలోని ఫోజిల్స్ (ఫోక్లోర్ సొసైటీ ఆఫ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్) కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 2025 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డును పొందారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ థౌజండ్ పిల్లర్స్, రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ, తెలుగు భాషోద్యమ సమాఖ్య వారిచే ఉత్తమ అధ్యాపక పురస్కారాలను పొందారు.ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, తెలంగాణ తెలుగు అకాడమీ డైరెక్టర్ ఆచార్య భట్టు రమేష్ లకు వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు. జానపద గిరిజన విజ్ఞాన పీఠం బోధన, బోధనేతర, నాలుగో తరగతి సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులు వెంకన్నను అభినందించారు.

RELATED ARTICLES

Most Popular