వరంగల్ వాయిస్, స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గo చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జంగం రవి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జంగం రవి యాదవ్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, గ్రామ సర్పంచ్ ఎడవెల్లి లావణ్య మల్లారెడ్డి, ఉపసర్పంచ్ పశుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రవి యాదవ్ పేర్కొన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు.
