Monday, August 17, 2026
HomeHanamkondaసీఎం రేవంత్ రెడ్డి సభతో పరకాలకు ఒరిగిందేంటి? మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి సభతో పరకాలకు ఒరిగిందేంటి? మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, హనుమకొండ :నిన్న పరకాలలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సభతో పరకాలకు ఒరిగిందేంటి అని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. సోమవారం హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ,మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్ అయ్యారు. కక్షసాధింపు ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు కష్టాలు గురించి ఆలోచన లేదని కనీసం నిన్న మాట్లాడలేదని విమర్శించారు. BRS చేసిన పనులకు రంగులు వెయ్యడం మేమే చేసినమని చెప్పుకోవడం విడ్డురంగా ఉందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం తో నీకేం పని? నీ అన్నదమ్ములు గురించి మేము మాట్లాడితే ఎలా ఉంటాదని విమర్శించారు.మీ కుటుంబ జోలికి, లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుందో ఆలోచించని మండిపడ్డారు.ప్రజాదానం వృథా చేసి ప్రజాపాలన పేరుతో సీఎం మీటింగ్స్ పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాటలు వినలేక ప్రజలు సభాస్థలి నుండి వెళ్ళిపోయారన్నారని విమర్శించారు.ప్రజల సమస్యలపైన సోయిలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రైతులకు యూరియా స్టాక్ పెట్టలేని అసమర్ధ సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోయారన్నారు.పరకాల ఎమ్మెల్యే పేరును సీఎం మర్చిపోయి మన్నెం ప్రకాష్ రెడ్డి అన్నాడని ఇక పరకాల ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని విమర్శించారు.నీళ్ళ గురించి ఏమి తెలియని మంత్రి పొంగులేటి మాట్లాడడం విడ్డూరమని అన్నారు.సీఎం, మంత్రులు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి వంద జన్మలు ఎత్తిన కేసీఆర్ ను కాధుకద ఆయన ఆనవాళ్లను కూడా ఏమి చెయ్యలేరన్నారు.అక్కంపేట విలేజ్ ఇప్పటికి రెవెన్యూ గ్రామంగా అయిందా?… కాలేదా?…రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.కాంగ్రెస్ లో ఉన్న నేతలు ఇతర పార్టీలకు వెళ్తమంటె సీఎంకు సిగ్గు అనిపిస్తలేదా?అధికార బలంతో ఏం మాట్లాడిన చెల్లుతుందని బ్రమలో ఉన్నారని విమర్శలు చేశారు.ప్రజలు అన్నీ గమణిస్తున్నారని త్వరలో మీ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఇప్పుడే ఉరికించాల్సి వస్తుందని తెలిపారు.సభ ప్రాంగణం పక్కనే ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్,దామెర చెరువు సుందరీకరణ పూర్తి చేయాలన్న సోయి ఎమ్మెల్యే కి లేదని మండిపడ్డారు.సిఎం వస్తున్నారని చిరు వ్యాపారస్తుల షాపులు తీసేసి వారిని రోడ్డున పడేశారు.. పక్కనే వారికోసం నిర్మిస్తున్న కాంప్లెక్స్ పూర్తి చేయాలని సోయిలేదన్నారు. మీటింగ్ రావాలని మహిళా సంఘాలను,రాకుంటే 1000 జరిమానా వేస్తామని బెదిరించారని మండిపడ్డారు. గడిచిన మూడేళ్లలో పరకాలలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular