Monday, September 28, 2026
HomeBlogగోడ్డటి బాలస్వామి యాదవ్‌కు జాతీయ పురస్కారం

గోడ్డటి బాలస్వామి యాదవ్‌కు జాతీయ పురస్కారం

📰 Generate e-Paper Clip

రచన రంగంలో సేవలకుగానూ ‘తెలుగు వెలుగు సాహితీ వేదిక’ సత్కారం

వరంగల్ వాయిస్, జనగామ : విద్యా, సేవా రంగాల్లో వివిధ అంశాలపై విశేష రచనలు చేస్తున్న జనగామ జిల్లా, నర్మెట్ట మండలం, హనుమంతపురం గ్రామానికి చెందిన ప్రముఖ రచయిత గోడ్డటి బాలస్వామి యాదవ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల సెప్టెంబర్ 04, 2026న శ్రీ కృష్ణాష్టమి ఉత్సవాల సందర్భంగా ఆయన ప్రచురించిన “శ్రీకృష్ణుడి బాటలో యాదవుల ధర్మ జీవనం” అనే సంపుటికి గానూ ఈ అవార్డు వరించింది. హనుమకొండలోని జయకృష్ణ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ‘తెలుగు వెలుగు సాహితీ వేదిక’ నిర్వాహకులు ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. బాలస్వామి రచించిన గ్రంథంలో యాదవ సమాజపు సంస్కృతి, సాంప్రదాయాలను లోతుగా పరిశోధించి పొందుపరిచారు. యాదవుల జీవన విధానం, కులం-వృత్తి మరియు వేషభూషణలు, కట్టుబాట్లు, సంస్కృతి, నీతి-నిజాయితీలు, ఇంటికి వచ్చిన అతిథులకు ఇచ్చే ఆతిథ్య గౌరవం, ఆనాటి కాలంలో యాదవ రాజులు ఏలిన రాజ్యాల విశేషాలు తెలుగు వెలుగు సాహితీ వేదిక ప్రతినిధులు బాలస్వామిని శాలువా, మెమెంటో, మెడల్, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించి జాతీయ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలస్వామి యాదవ్ మాట్లాడుతూ, ఈ అవార్డు తనలో రచన స్ఫూర్తిని మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అప్పిన భాస్కరాచారి: సినీ నటుడు, నిర్మాత, తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ వంగాల శాంతి కృష్ణ ఆచార్య, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, గౌరవ అధ్యక్షుడు, నుపూరు ముఖర్జీ బహుభాషా సినీ నటి (హీరోయిన్), ఆర్.ఎస్.నంద సినీ హాస్య నటుడు లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular