Sunday, September 20, 2026
HomeBlogఖాతాదారులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలే లక్ష్యం

ఖాతాదారులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలే లక్ష్యం

📰 Generate e-Paper Clip

కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సచిన్ ఆప్టే

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఖాతాదారులకు అత్యుత్తమ, ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ‘కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ చైర్మన్ సచిన్ ఆప్టే స్పష్టం చేశారు. శనివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట (ట్రైసిటీ) పరిధిలో తమ బ్యాంకు కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు ఈ నూతన శాఖ ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాస్మోస్ బ్యాంక్ చైర్మన్ సచిన్ ఆప్టే, వైస్ చైర్మన్ సీఏ యశ్వంత్ కుమార్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్తి ధోలేలతో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విచ్చేశారు. వారందరూ కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, చైర్మన్ సచిన్ ఆప్టే, వైస్ చైర్మన్ సీఏ యశ్వంత్ కుమార్, జేఎండీ ఆర్తి ధోలే ప్రముఖుల హాజరయ్యారు. ఏజీఎం గౌతమ్ రాయ్, హనుమకొండ బ్రాంచ్ ఇన్చార్జ్ సతీష్ కుమార్, సీనియర్ ఆఫీసర్ కె. చేతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విశాలమైన నెట్‌వర్క్ కలిగిన తమ బ్యాంకు, వరంగల్ ట్రైసిటీ ప్రాంతంలో కార్యకలాపాలను మరింత సమన్వయం చేస్తుందని వెల్లడించారు. స్థానిక ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలను అందించడానికి తమ బృందం సిద్ధంగా ఉందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular