సెల్ఫోన్ స్వాధీనం…
వరంగల్ వాయిస్,హనుమకొండ క్రైం : హనుమకొండ బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని మొబైల్ ఫోన్ దొంగతనానికి పాల్పడుతున్న ఒక యువకుడిని హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి దొంగిలించబడిన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, మాదిగ అరవింద్, S/o సుంకయ్య, వయస్సు 18 సంవత్సరాలు, నివాసం కీసర, మేడ్చల్ జిల్లా, గతంలో కూడా రద్దీగా ఉండే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వద్ద మొబైల్ ఫోన్లు, నగదు దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. దొంగిలించిన మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత ఖర్చులకు వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.ఇదే క్రమంలో ఈ నెల 28 తేదీన తెల్లవారుజామున హైదరాబాద్ నుండి బస్సులో బయలుదేరి సుమారు ఉదయం 07:30 గంటలకు హనుమకొండ బస్ స్టేషన్కు చేరుకున్నాడు. బస్ ఎక్కుతున్న ప్రయాణికులను గమనిస్తూ ఉండగా, సుమారు ఉదయం 08:00 గంటల సమయంలో ఒక ప్రయాణికుడి ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ను అతనికి తెలియకుండా దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.మరుసటి రోజు 29 న తిరిగి హనుమకొండ బస్ స్టేషన్కు వచ్చి ప్రయాణికుల వద్ద మొబైల్ ఫోన్లు లేదా నగదు దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అతని కదలికలను గమనించారు. పోలీసులను చూసి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితునిపై గతంలో ఉప్పల్, నల్గొండ 2 టౌన్, చేవెళ్ల, RPS వరంగల్, సికింద్రాబాద్ లలో ఆరు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ …బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ప్రజలు తమ మొబైల్ ఫోన్లు, నగదు, ఇతర విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అరెస్ట్ ను చూపిన వారిలో హనుమకొండ ఎస్సై కిషోర్, సిబ్బంది ఉన్నారు.
