Wednesday, September 16, 2026
HomeBlogసర్ విచారణ ప్రక్రియపై ఆర్డీవో తనిఖీ

సర్ విచారణ ప్రక్రియపై ఆర్డీవో తనిఖీ

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్,దామెర: దామెర రెవెన్యూ గ్రామంలో కొనసాగుతున్న సర్ విచారణ ప్రక్రియను పరకాల ఆర్డీవో డీఎస్ వెంకన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, విచారణ ప్రక్రియ కొనసాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో డీఎస్ వెంకన్న మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి అందుతున్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అభ్యంతరాలను పెండింగ్‌లో ఉంచవద్దని, నిర్ణీత సమయంలో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈకార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంఆర్‌ఐ రాధాకృష్ణ, సూపర్‌వైజర్ జీపీవో సురేష్, బీఎల్‌వోలు కోమల, రజిత, శైలజ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular