Wednesday, April 22, 2026
HomeHanamkondaమానవత్వాన్ని చాటుకున్న కౌన్సిలర్ పూర్ణ చారి

మానవత్వాన్ని చాటుకున్న కౌన్సిలర్ పూర్ణ చారి

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, నడికూడ : కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలోనే అసలైన మానవత్వం ఉందని పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అన్నారు. నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన పద్మశాలి కుల బంధువు కాంబత్తుల సాంబయ్య ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న పూర్ణ చారి బుధవారం బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. సాంబయ్య మృతితో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న కౌన్సిలర్, వారికి తక్షణ సాయంగా 50 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి ‘మేమున్నాం’ అనే భరోసా కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే నిజమైన తృప్తినిస్తుందని, ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడికూడ మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధీర్, మండల కార్యవర్గ సభ్యులు జాల ఇంద్రసేన రెడ్డి, వెల్డండి శ్రీనివాస్, బోజ కిషోర్ రెడ్డి, సల్పలా సురేష్, దయ్యలా లింగమూర్తి, కొండ శ్రవణ్ పాల్గొన్నారు. అలాగే 25వ బూత్ అధ్యక్షులు చెన్న రాజకుమార్, వెంగల రవితేజ, పరకాల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం, సవేరా హోటల్ యజమాని హాజిమియా, పద్మశాలి కుల బంధువులు దాసరి రమేష్, వావిలాల రవీందర్, క్యాతం రమేష్, సాంబయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular