Friday, August 14, 2026
HomeHanamkondaఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ

ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, దామెర: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా దామెర మండల కేంద్రంలో ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమిష్టిగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి గురిజాల శ్రీరామ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం మన స్వాతంత్ర్య పోరాటం, త్యాగం, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించడం అందరి బాధ్యత అని అన్నారు. దామెర పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ యాకయ్య మాట్లాడుతూ.. జాతీయ జెండా పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న త్యాగాలను స్మరించుకుంటూ యువత క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకుని “భారత్ మాతా కీ జై”, “వందే మాతరం” అంటూ చేసిన నినాదాలతో దామెర మండల కేంద్రం మార్మోగింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. “ప్రతి ఇంటా త్రివర్ణం… ప్రతి గుండెలో దేశభక్తి” అనే స్ఫూర్తితో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేల్పుల రాజ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ యాకయ్య, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజేష్, సుదర్శన్, పసరుగొండ సర్పంచ్ కొట్టే శ్రీవాణి రమేష్, కోగిల్వాయి సర్పంచ్ చుక్క వనిత–మహేందర్, నాయకులు మాదారపు రతన్ కుమార్, పిట్టల రమేష్, సూర చందర్, గండు ముఖేష్, పాలకుర్తి శ్రీలత, మెరుగు శ్రీనివాస్, చెక్క సతీష్, ముత్యాల రాజశేఖర్ గౌడ్, కన్నె కొమురయ్య, అన్నబోయిన రోహిత్, కాశెట్టి ప్రశాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular