Friday, August 14, 2026
HomeBhupalapallyవిద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి మల్హర్ మండలం కొండంపేట శివారు రోడ్ డ్యాం వద్ద విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి చెందారు. కాటారం మండలం గంగారం గ్రామం మార్వాడీ పల్లికి చెందిన ఇద్దరు రైతులు గురువారం సాయంత్రం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి మోటార్ సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో బాపు, అతడి కుమారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. రాత్రి అంత ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా శుక్రవారం ఉదయం వ్యవసాయ మోటార్ వద్ద విగత జీవులుగా పడి కనిపించారు. కుటుంబసభ్యులు కొయ్యూరు పోలీసులకు పిర్యాదు చేశారు. రైతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular