వరంగల్ వాయిస్, శాయంపేట : శాయంపేట మండల ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల సంఘం టేడ్ ఎడ్ టాక్ పోటీలలో బాలికల పాఠశాల విద్యార్థులు ముందు వరుసలో నిలిచారు.సీనియర్ విభాగంలో పదవ తరగతి విద్యార్థిని వి.అక్షయ మొదటి స్థానంలో నిలువగా, జూనియర్ విభాగంలో 8వ తరగతి విద్యార్థిని జి.అక్షయ మొదటి స్థానంలో నిలిచారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ పోటీలలో ఎంఈఓ బిక్షపతి బాలుర పాఠశాల హెచ్ఎం జనార్ధన్, బాలికల పాఠశాల హెచ్ఎం శ్రీలత కన్వీనర్ రాజి బాపు, కోకన్వీనర్ శేఖర్ బాబు, ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
