వరంగల్ వాయిస్, హనుమకొండ : మెడికల్ రంగంలో ప్రవేశానికి నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ పరీక్షను పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరిగే ఈ పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హనుమకొండ 04 కేంద్రాలు, వరంగల్: 02 కేంద్రాలు, కాజీపేట: 03 కేంద్రాలు, జనగామ: 02 కేంద్రాలు ఉన్నాయి.
