వరంగల్ వాయిస్, పరకాల : జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) యూనియన్‌ను నమ్ముకున్న ప్రతి జర్నలిస్టు కష్టసుఖాల్లో అండగా ఉంటామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ వల్లాల రమణ స్పష్టం చేశారు. గురువారం పరకాల పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో నిర్వహించిన పరకాల డివిజన్ స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే అతిపెద్ద జర్నలిస్టు సంఘంగా ఐజేయూ చేపడుతున్న పోరాటాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ ఇళ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేయించేలా రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. పరకాలలో త్వరలో జరిగే ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రత్యర్థుల ఆటంకాలను ఎదుర్కొని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ మెంబర్ తోట సుధాకర్, మధు, ప్రెస్ క్లబ్ కోశాధికారి అమర్, జిల్లా కోశాధికారి విష్ణువర్ధన్, సీనియర్ నాయకులు మెండు రవీందర్, రేపాల నరసింహారాములు మాట్లాడారు. సమాజానికి దిక్సూచిగా నిలిచే జర్నలిస్టులు ఐక్యతతో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం సందర్భంగా పరకాల డివిజన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కత్తిరాజు (సాక్షి టీవీ), ప్రధాన కార్యదర్శిగా చొల్లేటి సుధేందర్ (సాక్షి దినపత్రిక), కోశాధికారిగా అంకేశ్వర్లయ్య (ప్రజాపక్షం), ఉపాధ్యక్షులుగా దార్నా వేణుగోపాల్ (జనం సాక్షి), బొజ్జం చొక్కారావు (వరంగల్ వాయిస్), దూలం శ్రీనివాస్, ఎం.చిరంజీవి (నవతెలంగాణ), జాయింట్ సెక్రటరీలుగా కే.సతీష్ కుమార్ (జనం వాయిస్), ఆయిల్ విజయ్ (అక్షర దర్బార్), పి.శ్రీనివాస్ (సూర్య), నయీమ్ పాషా (పీసీడబ్ల్యూ న్యూస్), కార్యవర్గ సభ్యులుగా బత్తుల కార్తీక్, బి.రాజేందర్, గడబోయిన రమేష్, ఉష్ణగిరి శ్రీకాంత్, శ్రీనాథ్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌లోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
పరకాల డివిజన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
RELATED ARTICLES
