వరంగల్ వాయిస్, దామెర : దామెర మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేందర్ ను నియమిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాం రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తనకు సహకరించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలకు దుబాసి రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
