Tuesday, May 5, 2026
HomeHanamkondaరోడ్డు ప్రమాద బాధితులకు అండగా దామెర ఎస్సై అశోక్

రోడ్డు ప్రమాద బాధితులకు అండగా దామెర ఎస్సై అశోక్

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని ఓలాపూర్ శివారులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ గ్రిడ్ సమీపంలో ఊరుగొండ వైపు వెళ్తున్న ఒక ఆటోను, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై కొంక అశోక్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని గమనించిన ఆయన, అంబులెన్స్ కోసం వేచి చూడకుండా మానవత్వంతో స్పందించారు. తన సొంత వాహనంలోనే బాధితులను ఎక్కించుకుని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చిన ఎస్సై అశోక్ గారిపై స్థానికులు మరియు బాధితుల కుటుంబ సభ్యులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular